S.I.R. గురించి తెలుసుకోండి
SIR మీ మ్యాపింగ్ ఎలా చేసుకోవాలో తెలిపే ముఖ్య విషయాలు
2002 ఓటర్ లిస్ట్ మ్యాపింగ్ - ముఖ్యమైన విషయాలు 1. ఎవరి కోసం ఈ మెసేజ్?
- 2002 తర్వాత పెళ్లి చేసుకొని అత్తగారి ఊరికి వెళ్లిన ఆడవాళ్ల కోసం.
2. సమస్య ఏంటి?
- మీరు పెళ్లి చేసుకున్న ఊరి 2002 ఓటర్ లిస్ట్‌లో మీ పేరు ఉండదు.
- ప్రస్తుతం ఓటర్ మ్యాపింగ్ అంతా 2002 ఓటర్ లిస్ట్ ఆధారంగానే జరుగుతోంది.
3. మీరు ఏం చేయాలి?
- స్టెప్ 1: మీరు పుట్టిన ఊరికి వెళ్లండి.
- స్టెప్ 2: అక్కడి 2002 ఓటర్ లిస్ట్‌లో మీ అమ్మ లేదా నాన్న పేరు, సీరియల్ నంబర్ తెలుసుకోండి.
- స్టెప్ 3: ఆ సీరియల్ నంబర్‌ను మీరు ఇప్పుడు ఉంటున్న ఊరిలోని BLO కి ఇవ్వండి.
- స్టెప్ 4: BLO ఆ నంబర్‌తో మిమ్మల్ని ఇక్కడి ఓటర్ లిస్ట్‌లో మ్యాపింగ్ చేసి చేరుస్తారు.
4. ఇది చేయకపోతే ఏమవుతుంది?
- మీరు మీ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉంది.
5. 2002 లిస్ట్ ఎక్కడ దొరుకుతుంది?
- ప్రతి ఊరిలో తహసీల్దార్ ఆఫీస్ నుండి 2002 ఓటర్ లిస్ట్‌ను ఆ ఊరి BLO / అంగన్‌వాడీ టీచర్‌కు ఇచ్చారు.
- మీ పుట్టిన ఊరి BLO ని కలవండి.
6. గుర్తుంచుకోవాల్సిన విషయం:
- ఓటు కోల్పోకుండా చూసుకోవడం మన అందరి బాధ్యత.
- అందరూ తప్పకుండా మ్యాపింగ్ చేయించుకోండి.
🔹 1) సెల్ఫ్ మ్యాపింగ్ (Self Mapping)
🔹 2) యాడ్ ప్రోజెనీ (Add Progeny)
🔹 3) సెల్ఫ్ ప్రోజెనీ (Self Progeny)
━━━━━━━━━━━━━
🔹 1) సెల్ఫ్ మ్యాపింగ్ (Self Mapping)
2002 SIR ఓటర్ లిస్ట్‌లో పేరు ఉండి, అదే విధంగా 2025 ఓటర్ లిస్ట్‌లో కూడా పేరు ఉన్నవారు Self Mapping చేయించుకోవాలి.
అలాంటి వారు BLO వద్దకు వెళ్లి “Self Mapping” చేయాలని చెప్పాలి.
━━━━━━━━━━━━━
🔹 2) యాడ్ ప్రోజెనీ (Add Progeny)
2002 సమయంలో ఓటు హక్కు వయస్సు రాకపోవడం వల్ల పేరు లేకపోయినా, ఇప్పుడు 2025 ఓటర్ లిస్ట్‌లో పేరు ఉన్నవారికి ఈ మ్యాపింగ్ వర్తిస్తుంది.
అంటే మీ తాత, అమ్మమ్మ, నానమ్మ, నాన్న లేదా అమ్మ పేర్లలో ఏదైనా ఒకటి 2002 SIR లిస్ట్‌లో ఉంటే, మీరు తప్పనిసరిగా “Add Progeny” మ్యాపింగ్ చేయించుకోవాలి.
━━━━━━━━━━━━━
3) సెల్ఫ్ ప్రోజెనీ (Self Progeny)
2002లో మీకు 18 సంవత్సరాలు పూర్తయి ఉన్నా, ఏదైనా కారణం వల్ల 2002 SIR లిస్ట్‌లో మీ పేరు లేకపోతే —
మీ తాత, అమ్మమ్మ, నానమ్మ, నాన్న లేదా అమ్మ పేర్లలో ఏదైనా ఒకటి 2002 SIR లిస్ట్‌లో ఉంటే, మీరు “Self Progeny” మ్యాపింగ్ BLO ద్వారా చేయించుకోవాలి.
━━━━━━━━━━━━━
📌 ముందుగా 2002 SIR లిస్ట్ చూసి, మీరు ఏ మ్యాపింగ్‌కు చెందుతారో నిర్ణయించుకోవాలి.
📄 అలాగే 2002 SIR లిస్ట్‌లో మీ నాన్న / అమ్మ / తాత / అమ్మమ్మ / నానమ్మ పేరు ఉన్న పేజీ ప్రింట్ తీసుకుని, మీ ప్రస్తుత ఓటర్ IDతో కలిసి BLO వద్దకు తీసుకెళ్లాలి.
⚠️ BLO వద్దకు వెళ్లిన తర్వాత “Self Mapping”, “Add Progeny”, “Self Progeny” అనే పదాలను మనమే స్పష్టంగా చెప్పి మ్యాపింగ్ చేయించుకోవాలి.
ఎందుకంటే BLOలకు ప్రతి ఒక్కరి పరిస్థితి తెలియకపోవచ్చు. ఎక్కువగా వారు అంగన్‌వాడీ టీచర్లు లేదా ఆశా వర్కర్లు అయి ఉంటారు. కాబట్టి మనమే మన పరిస్థితికి సరిపోయే మ్యాపింగ్ ఏదో చెప్పి చేయించుకోవడం చాలా ముఖ్యం.
📢 ఈ సమాచారాన్ని ఎక్కువ మందికి షేర్ చేయండి.
తెలియని వాళ్ళకి ఉపయోగపడవచ్చు.
తెలంగాణ మరియు ఆంధ్ర ప్రజలకు SIR లో ఎలాంటి సమస్య వచ్చినా కేవలము ఫైలింగ్ చార్జెస్ మాత్రమే తీసుకొని ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర హైకోర్టులలో వారి కేసులను పూర్తిగా ఉచితంగా వాదించబడుతాయి
🚨 SIR గురించి చాలా చాలా ముఖ్యమైన సమాచారం 🚨
SIR లో 3 రకాల మ్యాపింగ్‌లు ఉన్నాయి. వీటిని సరిగ్గా అర్థం చేసుకోవడం చాలా అవసరం.
Young citizens who have attained the age of 18 years should verify their voter
details and participate in the revision process to strengthen democratic participation.